Tuesday, April 15, 2025
HomeఆటPark Hyatt Hotel: పార్క్ హ‌య‌త్‌లో అగ్నిప్ర‌మాదం.. వెళ్లిపోయిన SRH ఆటగాళ్లు

Park Hyatt Hotel: పార్క్ హ‌య‌త్‌లో అగ్నిప్ర‌మాదం.. వెళ్లిపోయిన SRH ఆటగాళ్లు

హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్‌-2లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్లో(Park Hyatt Hotel) అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ మొద‌టి అంత‌స్తులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. దీంతో సిబ్బంది, గెస్టులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మంటలు భారీగా ఎగసిప‌డటంతో ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్మేశాయి. అప్ర‌మ‌త్త‌మైన హోటల్ యాజ‌మాన్యం వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, అగ్నిమాప‌క యంత్రాల‌తో మంట‌ల‌ను ఆర్పివేశారు.

- Advertisement -

కాగా ఈ ప్ర‌మాద స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్ హైద‌రాబాద్(SRH) ఆటగాళ్లు ఆరో అంత‌స్తులో ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆట‌గాళ్లు, కుటుంబ‌స‌భ్యులు, స‌పోర్ట్ స్టాఫ్ అక్క‌డి నుంచి హోటల్ ఖాళీ చేసి బ‌స్సులో వెళ్లిపోయారు. ఇక ఈ ఐపీఎల్ సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల‌తో పాటు జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఈ హోటల్‌లోనే బ‌స చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News