తెలంగాణ ప్రజల ప్రేమ గొప్పదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం, వెల్టూరు గ్రామం, గోపాల సముద్రం వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ అందరినీ ప్రేమిస్తాదని,700 ఏళ్ల క్రితం నిర్మించిన గణపసముద్రం, వనపర్తి రాజులు నిర్మించిన గోపాల సముద్రాన్ని పునరుద్దరిస్తున్నా మనీ అన్నారు. వందల ఏళ్లు గుర్తుండిపోయే పనులు చేపట్టినట్టు, ఇవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. గత ప్రభుత్వాలు ఎందుకు తాగు నీరు అందించలేకపోయాయి, నాడు వలసెళ్లిన పాలమూరుకు ఇతర రాష్ట్రాల కూలీలు వలస వస్తున్నారని మంత్రి అన్నారు. తాగునీళ్లు, సాగునీళ్లు, కరెంటు పంచాయతీలు తెలంగాణలో లేవన్నారు.
పార్టీ జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు , జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ , రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జడ్పీటీసీలు రఘుపతిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మండల వైస్ ప్రెసిడెంట్ రఘుప్రసాద్ , మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వేణు యాదవ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు రాజాప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.