Tuesday, April 15, 2025
Homeచిత్ర ప్రభMass Jathara: ‘మాస్ జాతర’ మూవీ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది

Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా 75వ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘తు మేరా లవర్’ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను భాస్కరభట్ల రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీతం వహించారు. AI ఉపయోగించి దివంగత సింగర్ చక్రి వాయిస్‌తో ఈ పాటను పాడించడం విశేషం. ఇక ఈ పాటలో ఇడియట్ సినిమాలోని ‘చూపులతో గుచ్చి గుచ్చి’ సాంగ్ బీట్‌తో పాటు అవే సిగ్నేచర్‌ స్టెప్పులు వేయించారు.

- Advertisement -

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక యూత్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా మే9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2022లో వచ్చిన ‘ధమాకా’ మూవీలో రవితేజ, శ్రీలీల జోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News