కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్(Varla Kumar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన తొలుత పామర్రులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వర్ల కుమార్.. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆస్పత్రికి వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో కోలుకుని పార్టీ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. కాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడైన వర్ల కుమార్.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.