Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి(Vijayasai Reddy) షాక్ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఏప్రిల్‌ 18న విజయవాడలోని తమ ఆఫీసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -

కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంపై సిట్‌ అధికారులు హైదరాబాద్‌లో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ కేసులో కసిరెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News