ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల్లో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
- Advertisement -
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
