తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Inter Results) ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం మూల్యాంకనంలో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. మొత్తం వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ 21న ఫలితాలను విడుదల చేయానలి భావిస్తోంది. విద్యార్థులు తమ ఫలితాలను https://tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.