మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి(Vijayasai Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏప్రిల్ 18న విజయవాడలోని తమ ఆఫీసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ నోటీసులపై సాయిరెడ్డి స్పందించారు.
- Advertisement -
ఒక రోజు ముందుగానే విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. అంటే ఈనెల 17న విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈనెల 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. అందుచేత గురువారం విచారణకు వస్తానని చెప్పారు. విజయసాయి విన్నపానికి అధికారులు ఓకే చెప్పారు. దీంతో ఆయన రేపు విచారణకు విజయసాయి రెడ్డి హాజరుకానున్నారు.