Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Fibernet: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 500 మంది ఉద్యోగుల తొలగింపు

AP Fibernet: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 500 మంది ఉద్యోగుల తొలగింపు

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్(AP Fibernet)లో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా జీవీ రెడ్డి(GV Reddy) ఉన్న సమయంలో వైసీపీ హయాంలో నియమించిన 410 మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు లేవని ఉద్యోగాల నుంచి తొలగించారు. అంతేకాకుండా కొంతమంది ఉన్నతాధికారులపైనా వేటు వేశారు. అయితే జీవీ రెడ్డి బహిరంగంగా ఆరోపణల చేయడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా 2017‌లో ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌ను అతి తక్కువ ధరకే ఇవ్వాలనే లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసింది. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 లక్షల కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కొందరు ఉద్యోగులు వైసీపీ నేతల ఇళ్లలో పనిచేస్తూ జీతం తీసుకున్నారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News