భూమికి ముప్పు పొంచి ఉందా.. త్వరలోనే ప్రళయం రాబోతోందా. మానవాళికి మరణ శంఖం మోగబోతోందా.. అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక భారీ గ్రహశకలం భూమివైపు వేగంగా దూసుకొస్తోంది. దీనిపై నాసా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఇది భూమిని తాకితే.. అప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే కాళ్లకింద భూమి అదిరిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.
పసిడి రంగు కాంతులతో మెరిసే ఆకాశంలో ఓ ముప్పు దూసుకొస్తోంది. ఇది సాధారణ గ్రహశకలం కాదుఇది 2011 VG9 అనే అపోలో తరగతికి చెందిన శకలం. దీని పరిమాణం దాదాపు 390 అడుగులు, అంటే కుతుబ్ మినార్ అంత పొడవు ఉంటుంది. ఈ శకలం ఏప్రిల్ 16న భూమిని అత్యంత వేగంగా సమీపించనుంది. దాని వేగం గంటకు 85,520 కిలోమీటర్లు. అంత భారీ శరీరంతో, అంత వేగంతో వస్తున్నదే గనక భూమిని తాకితే అది ఒక నగరాన్ని నేలమట్టం చేసే శక్తిని కలిగి ఉంది.
ఇది భూమిని ఢీకొట్టే అవకాశం ఇప్పుడు కనిపించకపోయినా.. శాస్త్రజ్ఞులు దీని కక్ష్య మార్పులపై బాగా గమనిస్తున్నారు. ఒక చిన్న మార్పు కూడా పెను విపత్తుకు దారితీయవచ్చు. 2013లో రష్యాలో పడిన చిన్న గ్రహశకలం ఎంతటి విధ్వంసం చేసిందో మనకందరికీ గుర్తుంది. అప్పుడు దాని పరిమాణం 60 అడుగులు మాత్రమే. కానీ 2011 VG9 దాని కంటే పెద్దది. నాసా, గ్లోబల్ టెలిస్కోప్ నెట్‌వర్క్, రాడార్ సిస్టమ్‌ల ద్వారా ఈ గ్రహశకలాన్ని నిరంతరం గమనిస్తున్నారు.
CNEOS అనే స్పెషల్ సెంటర్ దీని గమనాన్ని ట్రాక్ చేస్తోంది. అయినాఖగోళ మార్గాలు ఎప్పుడైనా మారవచ్చు. అలాంటి పరిణామాలు ఊహించకుండా జరిగితే మాత్రంతట్టుకోలేనంత తీవ్రత వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ముప్పు లేకపోయినా, ఈ సంఘటన మనకు ఒక హెచ్చరికలాంటిది. మనం అంతరిక్షంపై ఎప్పుడూ దృష్టి కేంద్రీకరించాలి.. లేకపోతే మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.