ఐపీఎల్‌లో(IPL 2025)భాగంగా మరికాసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్(DC), రాజస్థాన్ రాయల్స్(RR) మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జట్టు.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓడింది. ప్రస్తుతం 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
ఢిల్లీ జట్టు: జేక్ ఫ్రెజర్, పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్, స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్‌శర్మ.
రాజస్థాన్ జట్టు: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే