ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 30 స్థానాల్లో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీ ఓ స్థానం కేటాయించింది. మిగతా స్థానాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించింది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
AP Govt: 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES