Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అట్లీ మూవీలో.. ట్రిపుల్ రోల్ లో అల్లు అర్జున్.. పెద్ద ప్లానింగే ఇది..!

Allu Arjun: అట్లీ మూవీలో.. ట్రిపుల్ రోల్ లో అల్లు అర్జున్.. పెద్ద ప్లానింగే ఇది..!

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై ఫ్యాన్స్ తో పాటు.. సినీ ప్రేమికులందరికీ ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ మొదట్లో త్రివిక్రమ్‌తో చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శకుడు అట్లీతో బన్నీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో చూస్తుంటే… హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉండబోతుందన్న ఫీల్ వస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అట్లీ కూడా పాల్గొని, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడి ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోలను సందర్శించి, టెక్నీషియన్లతో కథపై చర్చలు జరిపారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, సైఫై షాట్స్‌పై సలహాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని బీహైండ్ ద సీన్స్ వీడియోలు, ట్రయల్ వీఎఫ్ఎక్స్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బన్నీ ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ అన్నీ కూడా హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో ఉన్నాయి. ఇలా ఉంటే ఈ సినిమాకి సంబందించి మరో అప్‌డేట్ అందుతోంది. ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లే సినిమాగా ఇది నిలుస్తుందని ఫ్యాన్స్ పెద్దగా ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News