Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్ల ఇంజిన్ మాయం కేసులో.. 9 మంది అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో కియా కార్ల ఇంజిన్ మాయం కేసులో.. 9 మంది అరెస్ట్..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కియా కార్ల ఇంజిన్ మాయం కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మొత్తం 900 కార్లకు చెందిన ఇంజిన్లు మాయం అయిన కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి వారిని పెనుకొండకు తీసుకువచ్చారు. అరెస్టైన వారిలో 8 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కాగా, ఒకరు తిరుపతికి చెందిన వ్యక్తి. అందరూ కియా మోటార్స్‌కు చెందిన మాజీ ఉద్యోగులే అని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ 9 మందిని నాలుగు కార్లలో తమిళనాడులోని రాణిపేట నుంచి తీసుకువచ్చారు. వీరిని పెనుకొండ సీఐ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారణ కోసం ఇద్దరు ఎస్ఐలు, సీఐ కలిసి ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు విచారణ పూర్తయిన తర్వాత వారిని కోర్టులో హాజరు పరచనున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పటాన్ సలీమ్ ఉన్నాడు. కియా కార్ల తయారీ కేంద్రం నుంచి 900 ఇంజిన్లు మాయమైన విషయం కొద్దిరోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారులు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

కియా కంపెనీ 2019లో జూన్ నెలలో పెనుకొండలో తొలి కారు విడుదల చేసినప్పటి నుంచి ఇది ఏపీలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇలాంటి భారీ మోసం జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News