బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకూ బంగారం ధర భీబత్సంగా పెరుగుతుంది.. గత మూడు రోజులుగా పెరుగుతూ వస్తోంది. అయితే ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.8,920 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,731కి చేరింది. అదే 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 7,299 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలకు అదనంగా, జీఎస్టీ ఛార్జీలు ఉంటాయి.
- Advertisement -
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల, దేశీయంగా డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు.
నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఆచితూచి వ్యవహరించడం మంచిది.