Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభఅల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో.. బన్నీకి జోడిగా నటించేది ఎవరంటే..?

అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో.. బన్నీకి జోడిగా నటించేది ఎవరంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజి డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువైపోయింది. ఈ జోడీ నుంచి ఏ రేంజ్‌లో మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందోనని అంతా అంచనాలు వేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా, సమ్మర్ ముగిసిన తర్వాత షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ ఎవరోనన్న ఉత్కంఠ కూడా ఇప్పుడు పెరిగిపోతోంది. కొంతకాలంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ తాజా ఇంటర్నల్ బజ్ ప్రకారం.. ఈ మూవీలో ఐదుగురు టాప్ హీరోయిన్లను ఈ ప్రాజెక్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటిదాకా బయటికొచ్చిన లిస్ట్ చూస్తే… బాలీవుడ్ దేశీ డివా ప్రియాంకా చోప్రా పేరు ముందు వరుసలో ఉంది. అయితే ఆమె ఇప్పటికే మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో, ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. మరోవైపు సమంత పేరు బలంగా వినిపిస్తోంది. తేరి, మెర్సెల్ లాంటి సినిమాల్లో అట్లీతో పని చేసింది. అల్లు అర్జున్‌తో కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కలసి నటించింది. హీరో, డైరెక్టర్ ఇద్దరితోనూ మంచి బాండింగ్ ఉండటంతో సామ్ రీ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ కావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్‌లో క్రేజ్ అందుకుంటున్న జాన్వీ కపూర్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉంది. దేవర, పెద్ది సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి చేరువవుతున్న జాన్వీ, బన్నీ ప్రాజెక్ట్ చేస్తే తన క్రేజ్ మరింత పెరుగుతుందన్న ఆశతో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. సోషల్ మీడియాలో ఆమె పేరు మీద పోల్స్ కూడా షికారు చేస్తున్నాయి.. బన్నీతో జంటగా ఎలా ఉంటుంది అనే చర్చలతో. ఇక కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో రెండు హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. బన్నీకియారా కాంబినేషన్ స్క్రీన్ మీద వర్కౌట్ అయితే, మాజిక్ ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మరో గ్లామరస్ బ్యూటీ దిశా పటాని. స్టన్నింగ్ లుక్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లోనూ ఫిట్ అవుతుందనే కారణంతో దిశా పేరు ఇప్పుడు చర్చల్లో ఉంది. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ స్టైల్ యాక్షన్ సీక్వెన్సులు ఉండబోతున్నట్టు సమాచారం కావడంతో, ఆమెకు మంచి ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కబోయే ఈ భారీ సినిమాకు హీరోయిన్ సెలెక్షన్ విషయంలో ఇప్పుడు అభిమానుల్లోనూ, పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చివరకు ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఎవరు బన్నీ పక్కన స్క్రీన్ షేర్ చేస్తారో చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News