హైదరాబాద్‌లోని MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసుల విచారణలో ఊహించని మలుపు తిరిగింది. ట్రైన్‌లో యువతిపై అసలు అత్యాచారమే జరగలేదని తేలింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ట్రైన్‌లో నుండి యువతి జారిపడింది. ఈ విషయం అందరికి తెలిస్తే పరువు పోతుందని భావించిన యువతి.. అత్యాచారం కథ అల్లింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
100 మంది అనుమానితులను విచారించడంతో పాటు 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే యువతి చెప్పిన అంశాలకు విచారణలో ఎక్కడా పొంతన కుదరలేదు. దీంతో మరింత లోతుగా విచారణ ప్రారంభించిన పోలీసులకు యువతి అసలు విషయం వెల్లడించింది. రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడిన విషయాన్ని దాచిపెట్టి, అత్యాచారం జరిగినట్టు అబద్ధం చెప్పినట్టు ఒప్పుకుంది.