Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్PM Modi: ప్రధాని మోడీ ఏపీ పర్యటన కోసం ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు

PM Modi: ప్రధాని మోడీ ఏపీ పర్యటన కోసం ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు

ఏపీలో ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్న సంగతి తెలిసిందే. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇందులో ప్రధాని పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు దారీ చేసింది. ఈ కమిటీలో మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమర్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలను సభ్యులుగా నియమించింది.

- Advertisement -

ప్రధాని సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లు పరిశీలన, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోనుంది ఈ కమిటీ. ఇప్పటికే మోడీ పర్యటన కోసం నోడల్ ఆఫీసర్‌గా వీర పాండ్యన్‌ను నియమించింది. కాగా పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News