Saturday, April 19, 2025
HomeతెలంగాణLiquor Tetra Packet: మందుబాబులకు శుభవార్త.. రూ.50లకే మద్యం ప్యాకెట్లు

Liquor Tetra Packet: మందుబాబులకు శుభవార్త.. రూ.50లకే మద్యం ప్యాకెట్లు

తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 రూపాయలకే లిక్కర్ టేట్రా ప్యాకెట్(Liquor Tetra Packet) అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. 60, 90, 180ML ఉండేలా ఈ కొత్త మద్యం ప్యాకెట్లు ఉండేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్ మద్యం సేల్ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు ఇప్పటికే బీర్ల ధరలను పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం… త్వరలో లిక్కర్ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లిక్కర్ ధరలపై 10% ధరలు పెంచే అవకాశాలు ఉంది. ఎండాకాలం పూర్తి కాగానే పెంచిన ధరలు అమలులోకి రాబోతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News