హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం(Rains) కురుస్తోంది. ఎస్‌ఆర్ నగర్, బోరబండ, జూబ్లీహిల్స్, కోఠి, నాంపల్లి, హిమాయత్‌నగర్, కార్వాన్, కుత్బుల్లాపూర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే సాయంత్రం వేళ ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద వాన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES