Saturday, April 19, 2025
HomeఆటIPL 2025: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ విజయం..!

IPL 2025: ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ విజయం..!

ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయిన బెంగళూరు జట్టు నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.1 ఓవర్లలోనే ఛేజ్ చేసి గెలుపొందింది. అయితే ఈ విజయానికి మునుపు పంజాబ్ కూడా కొన్ని కష్టాలను ఎదుర్కొంది. ఓపెనర్లు సహా టాప్ ఆర్డర్ వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, నేహల్ వధేరా ధైర్యంగా ఆడి జట్టును గెలుపు బాటలో నడిపించాడు.

- Advertisement -

ప్రారంభంలో పంజాబ్ బ్యాటింగ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (16), ప్రభు సిమ్రన్ సింగ్ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. తరువాత శ్రేయస్ అయ్యర్ (7), ఇంగ్లిస్ (14) కూడా నిలకడగా ఆడలేకపోయారు. అయితే ఐదో స్థానంలో వచ్చిన వధేరా.. ఓ దశలో మ్యాచ్ ఆర్సీబీకి వెళ్తుందేమో అన్నట్టుగా ఉన్నప్పటికీ, తన చురుకైన ఆటతో ఫలితాన్ని మారుస్తూ నిలిచాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సులతో 33 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అంతక ముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముందు నుంచి చివరవరకూ వికెట్లు కోల్పోతూ దారుణ ప్రదర్శనిచ్చింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లీ (1) సహా మిగతా బ్యాటర్లు కూడా నిరాశపరిచారు. లివింగ్‌స్టన్ (4), జితేష్ శర్మ (2), క్రుణాల్ పాండ్యా (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే టిమ్ డేవిడ్ ఒక్కడే పరువు కాపాడాడు. ఆఖర్లో వన్‌మ్యాన్ షోలా ఆడి 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. మూడు సిక్సులు, ఐదు ఫోర్లు కొట్టిన డేవిడ్ మినహా మిగతా ఆటగాళ్లెవ్వరూ డబుల్ డిజిట్‌కూ చేరలేకపోయారు. రజత్ పటిదార్ 23 పరుగులు చేశారు.

బౌలింగ్ విభాగంలో పంజాబ్ అద్భుతంగా రాణించింది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జెన్సన్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. జేవియర్ బార్ట్‌లెట్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో హేజెల్‌వుడ్ మూడు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసినప్పటికీ, పంజాబ్ విజయం దాటించడాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ విజయంతో పంజాబ్ పాయింట్స్ టేబుల్‌లో మరో మెట్టు ఎక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News