ఏపీ లిక్కర్ స్కామ్(Liquor Scam) కేసులో సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మధ్యం కుంభకోణంలో భారీగా లబ్ధి పొందిన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజ్ కసిరెడ్డితో పాటు మిథున్‌రెడ్డి ఉన్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ధికారులు విచారించే అవకాశం ఉంది.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్కామ్ వెనక పెద్ద పెద్ద నేత హస్తం ఉందని అనుమానిస్తోంది. నాసిరకం మద్యం అమ్మడంతో పాటు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రాకుండా దారి మళ్లించారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ దిశగా విచారణను ముమ్మరం చేసింది. ఇప్పటికే విజయసాయి రెడ్డిని విచారించగా.. కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.