శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కెప్టెన్ రజత్ పాటీదార్(Rajat Patidar) సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ , రుతురాజ్ గైక్వాడ్ రికార్డును అధిగమించాడు. వీరిద్దరూ 31 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.
ఇక ఈ జాబితాలో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు కేవలం 25 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఈ ఏడాది బెంగళూరు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రజత్ పాటీదార్ ఏడు మ్యాచుల్లో 209 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.