ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో ‘పుష్ప2’ సినిమాలోని ‘సూ సేకీ’ పాటకు కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీతతో కలిసి స్టెప్పులు వేశారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రముఖులు కేరింతలో మరింత ఉత్సాహపరిచారు.
అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ 20వ తేదీన వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. కాగా గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం సంచలనంగా మారింది.