కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం(Annavaram) దేవస్థానంలో పెళ్లి వేడుకను భక్తులు అడ్డుకున్నారు. పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని భక్తులు, భద్రతా సిబ్బంది గుర్తించారు. దీనిపై యువతిని ఆరా తీయగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని వాపోయింది. తన వయసు 22 సంవత్సరాలని వరుడి వయసు 42 ఏళ్లు అని చెప్పింది. దీంతో భక్తులు పెళ్లిని నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వధూవరులతో పాటు ఇరు కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.
Annavaram: అన్నవరం దేవస్థానంలో పెళ్లిని అడ్డుకున్న భక్తులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES