దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఇవాళ 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల(YS Sharmila) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
- Advertisement -
“69వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నీవు నాపై చూపిన ప్రేమకు కేవలం కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకోలేను. నా కోసం నాతో ఎల్లప్పుడు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. లవ్ యూ సో మచ్ అమ్మ” అని ట్వీట్ చేశారు.