కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువులు ఉన్నాయంటూ ‘హాయ్ హైదారాబాద్’ అనే ఎక్స్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Smita Sabharwal) దానిని రీట్వీట్ చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తాజాగా ఈ నోటీసులపై ఆమె స్పందించారు. పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబు ఇచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ‘హాయ్ హైదరాబాద్’ ట్వీట్ ను తాను రీట్వీట్ చేశానని, తనలాగే మరో 2 వేల మంది కూడా దానిని రీట్వీట్ చేశారని తెలిపారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అని నిలదీశారు. కాగా కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.