Saturday, April 19, 2025
Homeహెల్త్కాళ్ల వాపుకు కారణం ఇదే.. తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

కాళ్ల వాపుకు కారణం ఇదే.. తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా..?

ఆరోగ్యంగా జీవించాలంటే శరీరాన్ని ప్రతి రోజూ కాపాడుకోవడం.. శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల, అవే పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటిలో వాపు ఒకటి. ఇది ఎప్పుడో ఓసారి ఎదురయ్యే సాధారణ ఆరోగ్య సమస్యే అయినా.. దీర్ఘకాలంగా కొనసాగితే శరీరానికి ముప్పే తెస్తుంది. ముఖ్యంగా కాళ్ల వాపు, చేతుల వాపు వంటి సమస్యలు బాధను కలిగించడమే కాదు పలు అనారోగ్య సమస్యలను సూచనగా కూడా ఉండొచ్చు. అయితే కొన్ని సహజమైన ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చడం ద్వారా ఈ వాపు సమస్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

- Advertisement -

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం శరీరంలో వాపు, మంట వంటి ప్రతికూల పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని నల్లమిరియాలుతో కలిపి తీసుకుంటే శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కీళ్ల నొప్పులు ఉన్నవారికీ చాలా ఉపయోగపడుతుంది. ఇక అల్లం గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఉండే జింజెరాల్ అనే మూలకం కాళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని టీ, డికాషన్ లేదా ఆహారంలో కలిపి సులభంగా ఉపయోగించవచ్చు.

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండినవే. వీటిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యం, చర్మ రక్షణకూ ఇవి ఎంతో మేలు చేస్తాయి. పాలకూర, మెంతి ఆకు, బ్రోకలీ వంటి ఆకుకూరలు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది, ఇది మంటలను తగ్గించడంలో సహకరిస్తుంది. అలాగే డీటాక్స్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుంది.

వంటలో తరచూ ఉపయోగించే టమోటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. టమోటా సూప్ లేదా కర్రీ రూపంలో తీసుకుంటే, మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనితో పాటు వెల్లుల్లి వాపును తగ్గించడంలో సహకరించే అద్భుతమైన పదార్థం. దీనిని పచ్చిగానో, లేదా వంటల్లోనో తీసుకోవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరచి శరీరంలోని మంటను తగ్గించడంలో తోడ్పడుతుంది.

రోజుకి ఒక్క రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. ఇందులో ఉండే కాటెచిన్ అనే సమ్మేళనం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. (గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా రాసినవి. మీరు శరీరంలో వాపుతో బాధపడుతున్నట్లయితే నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే.. వీటిని ట్రై చేయడం ఉత్తమం. దీనికి తెలుగు ప్రభ బాధ్యత వహించదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News