Saturday, April 19, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్JEE మెయిన్స్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన.. SR విద్యాసంస్థలు..!

JEE మెయిన్స్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన.. SR విద్యాసంస్థలు..!

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్స్ 2025 ఫలితాల్లో SR విద్యాసంస్థల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా జాతీయ స్థాయిలో SR విద్యార్థులు మెరిశారు. వివిధ కేటగిరీల్లో SR విద్యార్థులు గణనీయమైన ర్యాంకులు సాధిస్తూ సంస్థ కీర్తిని దేశవ్యాప్తంగా పటిష్టం చేశారు. SR విద్యార్థి V. నాగ సిద్ధార్థ (Reg. No. 250310222429) జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధిస్తూ టాప్-5లో స్థానం దక్కించుకున్నాడు. అతడి విజయం సంస్థలో ఆనందోత్సాహాన్ని నింపింది. అంతేగాక పాటిల్ సాక్షి జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు, ఎం. అరుణ్ 60వ ర్యాంకు, ఎం. రవి చంద్ర రెడ్డి 65వ ర్యాంకు, వై. భరణీ శంకర్ 88వ ర్యాంకు, బీ. సురేష్ 98వ ర్యాంకును సాధించారు.

- Advertisement -

ఇవే కాకుండా, SR విద్యార్థులు ఓపెన్ మరియు ఇతర కేటగిరీల్లో కలిపి 116, 142, 190, 246, 274, 410, 491, 509, 528, 567, 584, 647, 687, 707, 726, 826, 844, 969 వంటి టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఈ విజయాలు SR విద్యా సంస్థల ప్రమాణాలను, విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించాయి.

ఈ నేపథ్యంలో మే 18న జరగనున్న JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు ఇప్పటికే 35,596 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది రాష్ట్ర స్థాయిలో SR సంస్థ విజయ పథాన్ని మరింత ఎగురవేసినదిగా పేర్కొన్నారు.

ఈ విజయం వెనుక విద్యార్థుల శ్రమతో పాటు, SR విద్యాసంస్థల అకడమిక్ ప్రణాళికలు, ఫ్యాకల్టీ మార్గదర్శనం, టెస్టింగ్ మెథడాలజీ కీలకంగా నిలిచాయని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల సాంకేతిక సామర్థ్యం, పట్టుదలతో పాటు, సంస్థ ఇచ్చిన బలమైన అకడమిక్ ప్లాట్‌ఫామ్‌ వల్లే ఈ స్థాయిలో ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News