ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా డీఎస్సీ-2025(Mega DSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దరఖాస్తు పోర్టల్స్ https:// cse.ap.gov.in, https:// apdsc.apcfss.inతో పాటు సజావుగా దరఖాస్తు ప్రక్రియ కోసం ఒక వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరికీ లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, పరీక్షా షెడ్యూల్, సిలబస్, టీచర్ పోస్టుల వివరాలు, సంబంధిత జీఓలు, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES