80,000 మంది పోలీసులుండగా అమృత్ పాల్ సింగ్ ఎలా మిస్ అయ్యాడంటూ పంజాబ్ హైకోర్టు సర్కారును నిలదీసింది. ఖలిస్థాన్ సానుభూతిపరుడు అయిన అమృత్ పాల్ ఎలా పరార్ అయ్యాడంటూ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. అమృత్ కోసం గత మూడు రోజులుగా అంటే ఈరోజు 4వ రోజు కూడా పోలీసులు సోదాలు చేస్తున్నా అతని ఆచూకి అంతుచిక్కటం లేకపోగా, అతను పంజాబ్ దాటి ఉండచ్చనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అతనికి సంబంధించిన రెండు వాహనాలు, వ్యక్తిగత సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ మీదుగా అతను కెనడా వెళ్లి ఉండచ్చని అనుమానిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. అతనికి సహకరించిన మొత్తం 114 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
High Court: 80,000 మంది ఖాకీలుంటే అతనెలా పారిపోయాడు? కోర్టు ఆగ్రహం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES