అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) కుటుంబంతో సహా భారత పర్యటనకు విచ్చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయిన ఆయనకు భారత ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాన్స్ పిల్లలు మీడియా దృష్టిని ఆకర్షించారు. కుమారులు ఇవాన్, బ్లేక్, కుమార్తె మీరాబెల్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కన్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- Advertisement -
కాగా వాన్స్ భార్య ఉషా వాన్స్ తల్లిదండ్రులది భారతదేశం అన్న సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా వడ్లూరు గ్రామంలో ఉషా పేరెంట్స్ నివాసముండేవారు. అయితే 1980ల్లో అమెరికా వెళ్ల స్థిరపడ్డారు. ఉషా కూడా అమెరికాలోనే జన్మించారు.