Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్Janasena: జనవాణి కార్యక్రమంపై జనసేన కీలక ప్రకటన

Janasena: జనవాణి కార్యక్రమంపై జనసేన కీలక ప్రకటన

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు జనసేన(Janasena) పార్టీ ‘జ‌న‌వాణి’ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ స‌మ‌స్య‌ల‌తో ఈ కార్యక్రమానికి వచ్చే ప్ర‌జ‌ల‌ను స్వ‌యంగా ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు క‌లిసి వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. తాజాగా ఈ కార్యక్రమం నిర్వహణపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

వేస‌వి కాలం నేప‌థ్యంలో ‘జ‌న‌వాణి’కి వ‌చ్చే ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఈ కార్య‌క్ర‌మం ప‌నివేళ‌ల‌ను మార్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇక‌పై సోమ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు, కొన‌సాగింపుగా సాయంత్రం 4.30 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించనున్నట్లు పేర్కొంది. ఈ కొత్త ప‌ని వేళ‌లు ఏప్రిల్ 21 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ‌జన‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News