Monday, April 21, 2025
HomeతెలంగాణInter Results: రేపే ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

Inter Results: రేపే ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటర్ ఫలితాలను(Inter Results) రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పలువురు అధికారులు పాల్గొననున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

కాగా రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News