బంగారం(Gold) ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 3500 డాలర్లకు ఔన్స్ బంగారం ధర చేరింది.
- Advertisement -
కాగా అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య పోరు కారణంగా డాలర్ బలహీనపడింది. దీంతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా దేశంలోనూ బంగారం ధర పరుగులు పెడుతోంది. అటు వెండి ధరలు కూడా కిలో రూ.98 వేలుగా ఉంది.