ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(SSC Results) విడుదల తేదీని అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలిపారు.
- Advertisement -
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌లతో పాటు ‘మన మిత్ర’ వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే.