తెలుగు యంగ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆసక్తికరంగా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. భారీ హైప్‌తో రిలీజైనప్పటికీ, సినిమా పరవాలేదనిపించేలా సాగింది.
ఇక ఇప్పుడు నితిన్ కొత్త ప్రాజెక్ట్‌తో మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. ‘తమ్ముడు’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కోసం ‘వకీల్ సాబ్’ ఫేం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
‘తమ్ముడు’ అనే టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు గుర్తుకు తెచ్చేలా ఉండటంతో.. ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్ పవన్‌కు ఫ్యాన్ అన్న విషయం తెలిసిన విషయమే.. ఈ సినిమా టైటిల్ ఆయనకు ట్రిబ్యూట్ లా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ హాట్ అప్డేట్ ఫిలింనగర్లో హల్‌చల్ చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ‘తమ్ముడు’ను జులై 4న థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్ నిజమే కావాలని కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ‘తమ్ముడు’ సినిమా ద్వారా నితిన్ మరో బ్లాక్‌బస్టర్ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు.