తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal), భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Gutta Jwala) జంట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘మాకు ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడు పాప పుట్టడం మరింత ఆనందంగా ఉంది. మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’’ అని ఓ ఫొటో పంచుకున్నారు. దీంతో ఈ జంటకు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
2021 ఏప్రిల్ 22న వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన ‘లాల్ సలాం’ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇక బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.