గన్నవరం టీడీపీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై జైలులో ఉంటున్న వైసీపీ నేత వల్లభనేని వంశీకి(Vallabhaneni Vamsi) మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో నేటితో వంశీ రిమాండ్ ముగుస్తుండటంతో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే6వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో వంశీని విజయవాడ జైలుకు తరలించారు.
కాగా కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 14వ తేదీన వంశీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల నుంచి ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుతో పాటు భూకబ్జా కేసు కూడా వంశీపై నమోదైంది.