ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ముంబై నటి కాదంబది జత్వానీకి వేధింపుల కేసులో సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి ఆయనను తీసుకొచ్చారు. ఆంజనేయులతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయనను సుదీర్ఘంగా విచారించనున్నారు.
ఇదిలా ఉంటే పీఎస్‌ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారంటూ గుంటూరు సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కాగా గత ప్రభుత్వంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. జత్వానీ కేసులో పీఎస్‌ఆర్ రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయ్యారు. అలాగే పీఎస్‌ఆర్ కూడా సస్పెన్షన్‌లో ఉన్నారు.