Wednesday, April 23, 2025
Homeఆంధ్రప్రదేశ్కాసేపట్లో ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదల..!

కాసేపట్లో ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 23, 2025 బుధవారం ఉదయం 11 గంటలకు ఈ ఏడాది పదో తరగతి (SSC) ఫలితాలను విడుదల చేయనున్నట్టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) ప్రకటించింది. విజయవాడలో జరగబోయే ప్రత్యేక పత్రికా సమావేశంలో ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

- Advertisement -

ఏపీలో మార్చి 17 నుండి మార్చి 31 వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు కాగా, 3,05,153 మంది బాలికలు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 3,450 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి.

విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లు bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in ద్వారా హాల్ టికెట్ నంబర్ ఉపయోగించాలి. అంతేకాకుండా, “మన మిత్ర” వాట్సాప్ సేవలో 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా లేదా 55352 నంబర్‌కు హాల్ టికెట్ నంబర్ SMS చేయడం ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలు ప్రకటించిన వెంటనే మార్కుల మెమోను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఒరిజినల్ మార్క్‌షీట్ మాత్రం విద్యార్థులు తమ స్కూల్‌ల నుంచే పొందాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News