Thursday, April 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: టీడీపీ నేత భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

Chandrababu: టీడీపీ నేత భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

ప్రకాశం జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. యువగళం, అమరావతి రైతలు పాదయాత్రల సమయంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయని.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వండని సూచించారు. సీఎం వెంట మంత్రులు అనిత, ఆనం రాంనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా ఒంగోలు నగరంలో టీడీపీ నేత వీరయ్య చౌదరి మంగళవారం రాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. నలుగురు యువకులు వీరయ్య కార్యాలయానికి వెళ్లి కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News