Thursday, April 24, 2025
Homeచిత్ర ప్రభImanvi esmail: పాకిస్థాన్‌తో నాకు సంబంధం లేదు.. ప్రభాస్‌ హీరోయిన్‌ క్లారిటీ

Imanvi esmail: పాకిస్థాన్‌తో నాకు సంబంధం లేదు.. ప్రభాస్‌ హీరోయిన్‌ క్లారిటీ

పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ దేశం‌తో సంబంధాలను భారత ప్రభుత్వం పూర్తిగా తెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ నటీనటులు భారత సినిమాల్లో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో డిమాండ్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ చిత్రాల్లో పాకిస్తానీ నటీనటులు నటించకుండా పూర్తి నిషేధం విధించింది.

- Advertisement -

దీంతో రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ సినిమాలో హీరోయిన్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ (Imanvi esmail) గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇమాన్వీ కరాచీలో పుట్టారని ఆమె తండ్రి ఇక్బాల్‌ గతంలో పాకిస్థాన్‌ మిలటరీలో ఉన్నతాధికారిగా పనిచేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. తక్షణమే ఆమెను ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రచారంపై ఇమాన్వీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

‘‘నాకు, నా కుటుంబానికి సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. నేను పాకిస్థానీని కాదు. నాకు, నా కుటుంబంలోని ఎవరికీ ఆ దేశంతో సంబంధాలు లేవు. ద్వేషాన్ని కలిగించాలనే ఏకైక ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News