టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla Madhav) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కిరణ్‌ను పోలీసులు గుంటూరు తీసుకువస్తుండగా అతనిపై మాధవ్ దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పోలీసు కార్యాలయంలో కూడా మరోసారి దాడికి యత్నించడంతో పోలీసులు మాధవ్‌తో పాటు ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో మాధవ్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టేసి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించింది.