Monday, May 12, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ప్రధాని మోదీ టెర్రరిస్టు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: ప్రధాని మోదీ టెర్రరిస్టు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ(PM Modi) ఈ దేశ ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తుందన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మన దేశం మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మన దేశం మీద జరిగిన దాడి. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని ప్రధాని మోడీ గారు ఒక క్యాంపెయిన్ నడిపారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కాశ్మీర్ కి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? ఇది ముమ్మాటికి భద్రత లోపమే. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్ళు లేనే లేరు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమే. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. మోడీ చౌకిదార్ అని చెప్పుకుంటున్నారు. ఇదేనా చౌకిదార్ తనం. ఈ ఘటనకు అమిత్ షా, మోడీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలి. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్. ఇవ్వాళ దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తుంది.

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణం. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా PM మోడీ కోసం పని చేస్తుంది. దేశ భద్రతను గాలికొదిలేశారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమే. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారు. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. మోడీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదు.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News