ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై(Sunil Kumar) ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఐడీ చీఫ్‌గా, అగ్నిమాపకశాఖ డీజీగా ప్రభుత్వానికి తెలియకుండా పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు విచారణలో తేలింది. నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకుంది.
2022లో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని యూఏఈకి, మరోసారి అనుమతి లేకుండా స్వీడన్ వెళ్లాడని విచారణలో గుర్తించింది. అలాగే వెయింటింగ్‌లో ఉన్నప్పుడూ అనుమతి తీసుకోకుండా అమెరికా వెళ్లాడని మూడో ఛార్జ్ నమోదు చేసింది. ఇక 2019లో అమెరికా వెళ్తానంటూ యూకే వెళ్లినట్లు ఆరో ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్.. 2021లో ప్రభుత్వానికి తెలియకుండా యూఏఈ వెళ్లినట్లు ఐదో ఛార్జ్ నమోదు చేసింది. ఈ ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.