Saturday, June 14, 2025
HomeతెలంగాణVBIT: ప్రైవేట్ వీడియోలు.. వీబీఐటీ విద్యార్థినులు ఆందోళన

VBIT: ప్రైవేట్ వీడియోలు.. వీబీఐటీ విద్యార్థినులు ఆందోళన

మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కాలేజీ(VBIT) విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ వార్డెన్ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు తీస్తోందని ఆరోపించారు. వార్డెన్ వీడియోలను చిత్రీకరించడం గమనించిన కొందరు విద్యార్థినులు ఫోన్ లాక్కొని పరిశీలించారు. ఆ ఫోన్‌లో మరిన్ని వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలను ఆమె ఇతర వార్డెన్స్‌కు పంపించిందనే విషయాన్ని గుర్తించారు. విద్యార్థినులను అసభ్యకరంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News