Monday, April 28, 2025
HomeఆటIPL 2025: లక్నోపై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం..!

IPL 2025: లక్నోపై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో ఘన విజయం..!

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ విజయ యాత్ర కొనసాగుతోంది. లక్నో సూపర్ జయంట్స్‌పై జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ తేడాతో గెలిచి తన సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై, దూకుడుగా ఆడి 215 పరుగుల చేసింది. దీంతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ముంబై బౌలర్లు, ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

- Advertisement -

లక్నో ఛేజింగ్‌ తొలి నుంచే తడబాటు ప్రారంభమైంది. ముంబై పేస్ దళం ధాటికి లక్నో టాప్ ఆర్డర్ నిలవలేకపోయింది. మిచెల్ మార్ష్ (34), ఆయూష్ బదోని (35), నికోలస్ పూరన్ (27), డేవిడ్ మిల్లర్ (24) చెలరేగినా, మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. చివరికి 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటై ఓటమిని చవిచూశారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు, విల్ జాక్స్ రెండు వికెట్లు, కోర్బిన్ బాష్ ఒక వికెట్ సాధించారు. విజయం ఫలితంగా ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

అంతక ముందు ముంబై బ్యాటింగ్ చూస్తే ఓపెనర్ ర్యాన్ రిక్కల్‌టన్ 32 బంతుల్లో 58 పరుగులు బాదగా, సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 54 పరుగులుతో ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెందించారు. రోహిత్ శర్మ (12), విల్ జాక్స్ (29), తిలక్ వర్మ (5), హార్దిక్ పాండ్యా (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ, నమన్ ధిర్ (25) మరియు నోమిన్ బాష్ (20) చివర్లో చక్కటి ఇన్నింగ్స్‌లతో స్కోర్ బోర్డును మళ్లీ వేగంగా నడిపించారు.

లక్నో బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్, దిగ్వేష్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. అయితే ముంబై బ్యాటింగ్ దాడిని అడ్డుకోవడంలో వీరంతా విఫలమయ్యారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత మళ్లీ దూసుకుపోతుంది. ఇక లక్నో మాత్రం తేరుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News