బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్, బీజేపీలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమేనని ఆరోపించారు. కేసీఆర్ ఒకప్పుడు మోదీని దేవుడిలా పొగిడారని గుర్తుచేసిన రాజా సింగ్.. ఆ సమయంలో నిధుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. భయంతో మౌనంగా ఉండిపోయారా అంటూ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో తనను తాను అడిగిన ప్రతిసారి కేసీఆర్ తప్పు సమాచారం ఇచ్చారని విమర్శించిన రాజా సింగ్, కేంద్రం వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణకు పది లక్షల కోట్ల నిధులు ఇచ్చారని. కానీ కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊరుగా మార్చేశారు. మత్తు Telanganaగా మలిచారని విమర్శించారు. యువతను తాగుబాటుకు బానిసల్ని చేశారని కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రస్తుతం ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని భావిస్తున్నారని రాజా సింగ్. బీజేపీ నేతలు మరిద్దాం అనే స్థాయిలో లేరని.. లేకపోతే ఇప్పటికి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేదని” ఆయన వాపోయారు. అయితే త్వరలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి బీజేపీని ప్రజల్లోకి మరింత దగ్గర చేస్తారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ మాయలు నడవని.. ఇక ఫాంహౌస్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకోండి అంటూ రాజా సింగ్ అన్నారు.