Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్CID Custody: సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ ఆంజనేయులు

CID Custody: సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ ఆంజనేయులు

ముంబై నటి కాదంబరి జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR anjaneyulu) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్‌ వేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆదివారం, సోమవారం కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది.

- Advertisement -

అయితే ఆంజనేయులకి బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో ఆదివారం విచారణ జరపలేదు. ఈ క్రమంలో కాసేపటి క్రితం జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అంతకుముందు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తాడిగడప సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News